బంటురీతి కొలువు

ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

12/29/09

ఆభిమానమెన్నడు - కుంజరి రాగం



పల్లవి.             అభిమానమెన్నడు కల్గురా
                       అనాథుడైన నాదుపై నీకు

అనుపల్లవి.     అపరాధములన్ని మన్నింపుమయ్యా
                       అభిరామ పట్టాభిరామ నాయందు        (అభి)

చరణం.          కన్న తల్లియు కన్న తండ్రియు
                      అన్నియు నీవేయని నమ్మ లేదా
                      నిను వినా గతి నాకెవరు లేరే
                      నన్ను బ్రోవు త్యాగరాజ వినుత              (అభి)