బంటురీతి కొలువు

ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

12/29/09

ఆభిమానమెన్నడు - కుంజరి రాగం



పల్లవి.             అభిమానమెన్నడు కల్గురా
                       అనాథుడైన నాదుపై నీకు

అనుపల్లవి.     అపరాధములన్ని మన్నింపుమయ్యా
                       అభిరామ పట్టాభిరామ నాయందు        (అభి)

చరణం.          కన్న తల్లియు కన్న తండ్రియు
                      అన్నియు నీవేయని నమ్మ లేదా
                      నిను వినా గతి నాకెవరు లేరే
                      నన్ను బ్రోవు త్యాగరాజ వినుత              (అభి)

బంటు రీతి కొలువు - హంసనాదం రాగం

పల్లవి.            బంటు రీతి కొలువియ్యవయ్య రామ

అనుపల్లవి.     తుంట వింటి వాని మొదలైన
                      మదాదుల కొట్టి నేల కూల జేయు నిజ   (బంటు)

చరణం.          రోమాంచమను ఘన కంచుకము
                      రామ భక్తుడను ముద్ర బిళ్ళయూ
                      రామ నామమనే వర ఖడ్గమీవా
                      రాజిల్లునయ్య త్యాగరాజునికే                 (బంటు)

ఆనంద సాగర - గరుడ ధ్వని రాగం