పల్లవి. బంటు రీతి కొలువియ్యవయ్య రామ
అనుపల్లవి. తుంట వింటి వాని మొదలైన
మదాదుల కొట్టి నేల కూల జేయు నిజ (బంటు)
చరణం. రోమాంచమను ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయూ
రామ నామమనే వర ఖడ్గమీవా
రాజిల్లునయ్య త్యాగరాజునికే (బంటు)